గతేడాది ‘శంబాల’ చిత్రంతో సక్సెస్ అందుకున్న ఆది సాయికుమార్.. తన నెక్స్ట్ మూవీగా అదే కాంబినేషన్‌ను రిపీట్ చేస్తున్నాడు. ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన యుగంధర్ ముని దీనికి కథను ఇస్తూ.. సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. బృందా రవీందర్ ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్నాడు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు నిర్మిస్తున్నారు. ఈ అనౌన్స్‌మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆది సాయికుమార్ లుక్ ఆకట్టుకుంది.
ఎమోషన్స్‌తో పాటుగా ఈ సారి హారర్ ఎలిమెంట్స్‌ను సరికొత్తగా చూపించబోతోన్నట్టు మేకర్స్ తెలియజేశారు. భయం, ఉత్కంఠ, అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్‌తో మునుపెన్నడూ చూడని ఒక కొత్త అనుభూతిని అందిస్తామని అన్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
