KGF2 మ్యూజిక్ ఎఫెక్ట్ .. కాంగ్రెస్ ట్విట్టర్ బ్లాక్ చేయాలని ఆదేశం

KGF2 మ్యూజిక్ ఎఫెక్ట్ .. కాంగ్రెస్ ట్విట్టర్ బ్లాక్ చేయాలని ఆదేశం

కాంగ్రెస్ పార్టీకి బెంగళూరు కోర్టు షాక్ ఇచ్చింది. ఆ పార్టీ ట్విట్టర్ అకౌంట్తో పాటు భారత్ జోడో ట్విట్టర్ అకౌంట్నూ తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్ 2 సాంగ్స్ ప్లే చేశారని మ్యూజిక్ సంస్థ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

రాహుల్ గాంధీ ఇటీవల కర్నాటకలో భారత్ జోడో యాత్ర చేపట్టారు. అయితే కాపీరైట్ రూల్స్ ఉల్లంఘించి కేజీఎఫ్2 లోని పాటలను ఉపయోగించారని ఎంఆర్టీ మ్యూజిక్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లో రాహుల్ గాంధీ సహా ముగ్గురు సీనియార్ నాయకులపై ఆరోపణలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన బెంగళూరు కోర్టు కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ తో పాటు భారత్ జోడో యాత్ర అకౌంట్ ను సైతం తాత్కాలికంగా బ్లాక్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.