బ్లడ్ అండ్ చాక్లెట్ : వ‌‌యొలెన్స్ కాదు..లవ్ అండ్ ఎమోషన్స్

బ్లడ్ అండ్ చాక్లెట్ :   వ‌‌యొలెన్స్ కాదు..లవ్ అండ్ ఎమోషన్స్

అర్జున్ దాస్, దుషారా విజయన్ జంటగా నటించిన చిత్రం ‘బ్లడ్ అండ్ చాక్లెట్’.  వసంతబాలన్ దర్శకుడు. డైరెక్టర్ శంకర్ సమర్పణలో రూపొందిన ఈ  చిత్రాన్ని తెలుగులో ఎస్.ఆర్ డి.ఎస్ సంస్థ విడుదల చేయనుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఈ సినిమా ట్రైల‌‌ర్‌‌ను సోమ‌‌వారం హైద‌‌రాబాద్‌‌లో విడుద‌‌ల చేశారు. 

ఈ సందర్భంగా అర్జున్ దాస్ మాట్లాడుతూ ‘నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వసంత బాలన్‌‌ గారితో వర్క్ చేయడం  మెమొర‌‌బుల్ ఎక్స్‌‌పీరియెన్స్‌‌. తెలుగు ప్రేక్షకులు న‌‌న్నెంత‌‌గానో ప్రోత్సహిస్తున్నారు. ఈ సినిమా విష‌‌యంలోనూ మీ ప్రేమాభిమానాలు ఇలాగే ఉండాల‌‌ని కోరుకుంటున్నా’ అన్నాడు.  వసంత బాలన్ మాట్లాడుతూ ‘ఈ టైటిల్ వినగానే మ‌‌న‌‌కు వ‌‌యొలెన్స్ మాత్రమే గుర్తుకు వ‌‌స్తుంది. 

కానీ ఇందులో  బ్లడ్ అండ్ చాక్లెట్‌‌తో పాటు ప్రేమ‌‌, అభిమానం, మంచి ఎమోష‌‌న్స్ కూడా ఉంటాయి’అని  చెప్పాడు. దుషారా విజయన్, వనితా విజయ్ కుమార్, డైలాగ్ రైటర్ రాజశేఖర్ రెడ్డి,  నిర్మాత దేవసాని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.