పెట్స్​ కోసం బ్లడ్​ బ్యాంక్​ వెబ్​సైట్​ 

పెట్స్​ కోసం బ్లడ్​ బ్యాంక్​ వెబ్​సైట్​ 

మనుషులకు ఏదైనా ప్రమాదం జరిగి బ్లడ్‌‌ అవసరమైతే మరో మనిషి రక్తదానం చేయొచ్చు. లేదంటే బ్లడ్​బ్యాంకులకు వెళ్లి తెచ్చుకోవచ్చు. అదే జంతువులు గాయపడి బ్లడ్‌‌ అవసరమైతే పరిస్థితి ఏంటీ ? అసలు బ్లడ్​దొరికేది ఎట్లా? ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి. ఇకపై జంతు ప్రేమికులు అలాంటి పరిస్థితులు ఎదురైతే అధైర్య పడాల్సిన అవసరం ఉండదు.

జంతువుల బ్లడ్​బ్యాంకు సంబంధించి ఓ వెబ్​సైట్​ కొద్దిరోజుల్లోనే  అందుబాటులోకి రానుంది. దేశంలోని ప్రముఖ సిటీలతో పాటు 135 పట్టణాల్లోని జంతువుల(కుక్కలు, పిల్లులు) వివరాలు, వాటికి సంబంధించిన బ్లడ్​గ్రూపు, పెంపుడు జంతువుల యజమానుల పూర్తి వివరాలు ఆ వెబ్ సైట్​లో ఉంటాయి. జంతువుల బ్లడ్​బ్యాంకు సంబంధించిన వెబ్​సైట్ ను ఫస్ట్‌‌ టైం సిటీకి చెందిన జంతు సంరక్షణ కార్యకర్త శివకుమార్ రూపొందించారు. ఈ నెల 14 న వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా అందుబాటులోకి తెస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని పెంపుడు జంతువుల యాజమానులు బ్లడ్‌‌ దానం చేయడమే ఏకైక లక్ష్యంగా నెలకొల్పడం ఒకటైతే, గాయపడిన జంతువులకు బ్లడ్‌‌ అవసరం ఉన్న వారికి ఈ వెబ్​సైట్​ ద్వారా దొరికేందుకు అవకాశం ఉంటుంది.

దేశంలో ఒకే ఒక్కటి…

తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జంతువులు కోసం దేశంలో ఒక్కటే బ్లడ్‌‌ బ్యాంకు చెన్నైలో మాత్రమే ఉంది.  ప్రస్తుతానికి ఈ బ్లాడ్​సేవలకు చాలా డిమాండ్ ఉంది. ఇది సామర్థ్యాన్ని మించి సేవలు అందిస్తుంది. మరోవైపు జంతువులకు వ్యాధులు, ప్రమాదాలు అయినప్పుడు వెటర్నరీ డాక్టర్లను సంప్రదిస్తుంటారు. జంతువుల కోసం మనీ ఖర్చు పెడుతుంటారు. కానీ వాటికి అవసరమైన బ్లడ్‌‌ కావాలంటే ఎక్కడికి వెళ్లాలో తెలియదు. బ్లడ్ గ్రూప్‌‌​ఏంటో కూడా యాజమానులకు అవగాహన ఉండదు.

ఏడాదిన్నర రీసెర్చ్‌‌ చేసి రూపొందించా.. 

వివిధ రకాల వ్యాధుల కారణంగా జంతువులు రక్తాన్ని కోల్పోవడం, కొన్ని సందర్భాల్లో కుక్కలు, పిల్లులు గాయపడి బ్లడ్‌‌ పోయి చనిపోవడం చూశాను జంతు సంరక్షణ కార్యకర్త శివకుమార్. ఆరా తీయగా చెన్నైలో మాత్రమే జంతువుల బ్లడ్‌‌ బ్యాంక్‌‌ ఉందని తెలిసిందన్నారు. పూర్తిగా రిసెర్చ్‌‌ చేశాకే వెబ్ సైట్​అందుబాటులోకి తేవాలని  నిర్ణయించుకున్నానని చెప్పారు. దేశంలోని పలు నగరాలు, పట్టణాలకు వెళ్లాల్సి వచ్చిందని… ఏడాదిన్నరపాటుగా పరిశోధన చేసి వెబ్​సైట్​ను రూపొందించానన్నారు. ఇది జంతు ప్రేమికులకు చాలా ఉపయోగంగా ఉంటుందని తెలిపారు.