హైదరాబాద్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం 

 హైదరాబాద్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం 

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సోనియాగాంధీ జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్న వారికి పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయగా.. పలు చోట్ల వృద్ధాశ్రమాలకు వెళ్లి అక్కడి వారికి తమ వంతు సేవలు అందించారు. ఇంకొన్ని చోట్ల అన్నదాన, రక్తదాన, ఉచిత వైద్య  శిబిరాలు నిర్వహించారు. 

హైదరాబాద్ నగరంలోని బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మల్లు రవి ప్రారంభించారు. రక్తదానం చేసిన నాయకులు, కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలను రేవంత్ రెడ్డి అభినందించారు.