జ్యోతిష్యం : ఆకాశంలో బ్లడ్ మూన్ .. చంద్రగ్రహణం వలన కలిగే ఫలితాలు ఇవే..!

జ్యోతిష్యం : ఆకాశంలో బ్లడ్ మూన్ .. చంద్రగ్రహణం వలన కలిగే  ఫలితాలు ఇవే..!

 సెప్టెంబర్​ 7 వ తేది ఆకాశంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబోతుంది.  తెల్లగా కనపడాల్సిన చంద్రుడు  కొద్ది గంటలపాటు ఎర్రగా కనపడతాడు. అంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.  ఈ బ్లడ్​ మూన్​ ఇండియాలో పలు ప్రాంతాల్లో స్పష్టంగా చూడవచ్చు.  ప్రపంచవ్యాప్తంగా  85 శాతం మంది ఈ దృశ్యం కనువిందు చేయనుంది.  

సైన్స్ ప్రకారం.. సూర్యుడు... చంద్రుడు మధ్యకు భూమి అడ్డుగా వచ్చినప్పుడు .. సూర్యుని కాంతి  చంద్రుడిపడకుండా .. ఎర్రని తరంగాలు  పొరలు పొరలుగా చంద్రుడిని తాకడంతో ఎరుపు.. నారింజ రంగులోకి మారతాడు. ఇలా మారిన చంద్రుడిని రేలి స్కాటరింగ్​ అంటారు. 

పంచాంగం ప్రకారం ఈ ఏడాది చివరి  చంద్రగ్రహణం 2025 సెప్టెంబర్ 7వ తేది  రాత్రి 9:57 గంటలకు ప్రారంభమై దాదాపు మూడున్నర గంటల పాటు కొనసాగుతుంది.  ఈ గ్రహణం సెప్టెంబర్​ 8 వతేది తెల్లవారుజామున   01:26 గంటలకు ముగుస్తుంది. 

జ్యోతిషశాస్త్రం ప్రకారం.... ఈ గ్రహణం కుంభ రాశిలో పూర్వాభాద్ర.. శతభిషం  నక్షత్రాలలో ఏర్పడుతుంది.  గ్రహణం సమయంలో  రాహువు ... చంద్రుని దగ్గర ...  సూర్యుడు... కేతువు కన్యారాశిలో ఉంటారు . ఈ గ్రహాల కలయిన చాలా చెడు ప్రభావాన్ని  కలుగజేస్తుందని పండితులు అంటున్నారు. చంద్రగ్రహణం సమయంలో కలిసిన గ్రహాల వలన ఈ ఏడాది  ప్రకృతి వైపరీత్యాలకు (భూకంపం, తుఫాను, మేఘాల విస్ఫోటనం మొదలైనవి) సంకేతమని అంటున్నారు. సాధారణంగా గ్రహణాల ప్రభావం 40 రోజులు ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

చంద్రగ్రహణం ప్రభావంతో  పర్వత ప్రాంతాలలో భూకంపాలు సంభవించే అవకాశం ఉంది.  ప్రపంచ రాజకీయాల్లో కూడా ప్రకంపనలు ఉండేఅవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.  భారతదేశంతో అమెరికా వాణిజ్య ఒత్తిడి...  ఇజ్రాయెల్ దూకుడు ...  ఉద్రిక్తతలు పెరగుతాయని పండితులు చెబుతున్నారు. 

జ్యోతిషశాస్త్రం ప్రకారం  సెప్టెంబర్​ 7న ఏర్పడే చంద్రగ్రహణం ప్రభావం  వృషభ, మిథునం, సింహ, తుల  కుంభ రాశుల వారిపై ఎక్కువగాఉంటుంది.  రాబోయే రోజుల్లో క్లిష్ట పరిస్థితుల్లో  సహనం.. సంయమనం పాటించాలని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. 

  •  వృషభ రాశి :  ఆరోగ్యం ...  ఆర్థిక సమస్యలు
  •  మిథున రాశి : సంతానం వలన  ఒత్తిడి 
  •  సింహ రాశి:  వైవాహిక జీవితంలో సంఘర్షణలు తలెత్తే అవకాశం 
  •  తుల రాశి:  ఆర్థిక ఖర్చులు ...  లాభాలలో ఆలస్యం 
  •  కుంభ రాశి :  కార్యాలయంలో అకస్మాత్తుగా ప్రమాదం జరుగుతుందనే భయం..  శత్రువుల జోక్యం 

పురాణాలు.. ఆచారాలు ప్రకారం...  ఏదైనా గ్రహణానికి  9 గంటల ముందు సూత కాలం ప్రారంభమవుతుంది.  అంటే సెప్టెంబర్​ 7 వ తేది  మధ్యాహ్నం  12:57 గంటలకు సూతకాలం ప్రారంభమవుతుంది.  

  • గ్రహణ సమయంలో పూజ, ఆహారం, తినడం మరియు త్రాగడం, పదునైన ఉపకరణాలు (కత్తి, కత్తెర వంటివి), దేవుడి విగ్రహాలను తాకడం మొదలైనవి  చేయకూడదు.
  • గ్రహణ సమయంలో పొరపాటున  తులసిని తాకకూడదు.  
  • గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, పిల్లలు చాలా  జాగ్రత్తగా ఉండాలి. 
  • గ్రహణం సమయంలో, ఇంటి నుండి బయటకు వెళ్లడం అంత మంచిది కాదని పండితులు చెబుతున్నారు.