ఎన్‌ఐ‑ఎంఎస్‌ఎంఈలో ఈసీ మెంబర్‌‌గా బొడ్డు శ్రీకాంత్‌

ఎన్‌ఐ‑ఎంఎస్‌ఎంఈలో ఈసీ మెంబర్‌‌గా బొడ్డు శ్రీకాంత్‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫర్ అఫిర్మిటివ్‌‌‌‌ యాక్షన్‌‌‌‌ (ఐసీసీఏఏ)– సౌత్ ఇండియా ప్రెసిడెంట్‌‌‌‌గా సేవలందిస్తున్న బొడ్డు శ్రీకాంత్  నేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ (ఎన్‌‌‌‌ఐ–ఎంఎస్‌‌‌‌ఎంఈ) లో ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ)  మెంబర్‌‌‌‌‌‌‌‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎంఎస్‌‌‌‌ఎంఈ సెక్రెటరీ బీబీ స్వైన్‌‌‌‌ ఆయనకు  శుభాకాంక్షలు చెప్పారు.

ఎంఎస్‌‌‌‌ఎంఈ  జాయింట్ సెక్రెటరీ మెర్సీ పావ్‌‌‌‌, ఎన్‌‌‌‌ఐ–ఎంఎస్‌‌‌‌ఎంఈ డైరెక్టర్ జనరల్‌‌‌‌ గ్లోరి స్వరూపా సారధ్యంలో  ఢిల్లీలోని ఉద్యోగ్‌‌‌‌ భవన్‌‌‌‌లో శ్రీకాంత్ తన కొత్త బాధ్యతలను  తీసుకున్నారు. ఎన్‌‌‌‌ఐ– ఎంఎస్‌‌‌‌ఎంఈ తమ 31 వ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ను బుధవారం నిర్వహించింది. బీబీ స్వైన్‌‌‌‌ అధ్యక్షతన ఈ మీటింగ్‌‌‌‌ జరిగింది. ఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌‌‌‌, బెంగళూరులో  ఎంటెక్ చేసిన శ్రీకాంత్‌‌‌‌, ఎన్‌‌‌‌ఐటీ, నాగ్‌‌‌‌పూర్ నుంచి  బీటెక్‌‌‌‌ పట్టా అందుకున్నారు. తొమ్మిదేళ్ల పాటు ఇండియా, యూఎస్‌‌‌‌లలో ప్రైవేట్ జాబ్స్‌‌‌‌ చేసిన  శ్రీకాంత్ తన భార్య నిషితాతో కలిసి  సోలార్ పీవీ మాడ్యుల్స్‌‌‌‌ను తయారు చేసే  సన్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌ను 2010 లో ఏర్పాటు చేశారు.