2025 సంవత్సరంలో ప్రపంచ సినిమా బాక్సాఫీస్‌ను పూర్తిగా షేక్ చేసిన చిత్రంగా చైనీస్ యానిమేటెడ్ ఫాంటసీ మూవీ ‘నేఝా 2’ (Ne Zha 2) నిలిచింది. 2019లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం ‘నేఝా’కు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు జియావోజీ స్వయంగా రచించి దర్శకత్వం వహించాడు.
ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 2.2 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. భారతీయ కరెన్సీలో ఇది దాదాపు రూ.19 వేల కోట్లకు పైగా వసూళ్లకు సమానం. సుమారు రూ.710 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా, యానిమేషన్ చిత్రాల చరిత్రలోనే అరుదైన ఘనతను నమోదు చేసింది.
చైనీస్ మైథాలజీ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం స్నేహం, త్యాగం, విధిని ఎదిరించే పోరాటం వంటి భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించింది. 2025 జనవరి చివర్లో చైనాలో విడుదలైన ‘నేఝా 2’, ఆ తర్వాత దశలవారీగా అనేక దేశాల్లో విడుదలై, ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన పొందింది. భారత్‌లో ఈ సినిమా ఏప్రిల్ నెలలో హిందీ డబ్బింగ్‌తో విడుదలై మంచి ఆదరణను దక్కించుకుంది.
Also Read : ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్
ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Apple TVలో స్ట్రీమింగ్ అవుతుండటం గమనార్హం. థియేటర్లలో సంచలన విజయాన్ని సాధించిన తర్వాత, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో కూడా ఈ సినిమా భారీగా వీక్షకులను ఆకర్షిస్తోంది. యానిమేషన్ సినిమాలకే కాకుండా, ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఐదో స్థానంలో ‘నేఝా 2’ నిలవడం విశేషం.
ఈ జాబితాలో మొదటి నాలుగు స్థానాల్లో ఈ జాబితాలో మొదటి స్థానంలో 'అవతార్', ఆ తర్వాత 'అవెంజర్స్: ఎండ్రోమ్' 'అవతార్: ది వే ఆఫ్ వాటర్', 'టైటానిక్' వంటి హాలీవుడ్ దిగ్గజ చిత్రాలు ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే, చైనీస్ యానిమేషన్ సత్తాను ప్రపంచానికి చాటిన చిత్రంగా ‘నేఝా 2’ సినిమా 2025 ఏడాదికి బాక్సాఫీస్ కింగ్‌గా నిలిచింది.
