ఐకమత్యంగా పని చేయండి : సుదర్శన్​రెడ్డి

ఐకమత్యంగా పని చేయండి :  సుదర్శన్​రెడ్డి
  • ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

ఎడపల్లి,  వెలుగు :  రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో  కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంగా పనిచేసి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని  బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ బోధన్​ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్​ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. వచ్చే ఎన్నికల కోసం నియోజకవర్గంలో మండలాల కార్యవర్గాలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.

 2017 కు ముందున్న వారికే పార్టీ పదవుల్లో చోటు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్,  కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మండలాధ్యక్షుడు పులి శ్రీనివాస్​, ఉర్దూ అకాడమీ చైర్మన్​ తాహెర్​ బిన్​ హందాన్, పార్టీ నాయకులు బిల్లా రాంమోహన్, ఈరంటి లింగం, కరుటూరి నారాయణ, ఎల్లయ్య యాదవ్, శంకర్​ నాయుడు, భాస్కర్​రెడ్డి, మల్కారెడ్డి, ఎడపల్లి, రెంజల్, నవీపేట్, బోధన్​ మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.