
మహారాష్ట్రలో ఘోర విషాదం జరిగింది. ఓ మహిళ, తన నలుగురు కూతుళ్లతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య పాల్పడింది. బుల్ధానా జిల్లాలోని మెల్గావ్ లో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో వారంతా మృతి చెందారు. దీనిపై సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బావి నుంచి మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు. వీరి మృతికి గల కారణాల గురించి ఎంక్వయిరీ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.