బోడుప్పల్ ప్రజలను చల్లగా చూస్తా ..భవిష్యవాణి చెప్పిన అమ్మవారు

బోడుప్పల్  ప్రజలను చల్లగా చూస్తా ..భవిష్యవాణి చెప్పిన అమ్మవారు

మేడిపల్లి, వెలుగు: ప్రతి ఏటా మొక్కులు చెల్లించి తనను వైభవంగా చూస్తున్నారని, బోడుప్పల్ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మైసమ్మ అమ్మవారు చెప్పారు. బోడుప్పల్​లో రెండు రోజుల పాటు నిర్వహించిన బోనాల పండుగ సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా బంగారు మైసమ్మ దేవాలయం వద్ద అమ్మవారు భవిష్యవాణి చెప్పారు.

బోడుప్పల్​ ప్రజలకు కష్టాలు రానివ్వబోనన్నారు. కార్యక్రమంలో టీ‌‌‌‌పీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ కాంగ్రెస్ ఇన్​చార్జి తోటకూర వజ్రేశ్​యాదవ్, మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు పోగుల‌‌‌‌ నరసింహారెడ్డి, కొత్త కిశోర్ గౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు బొబ్బల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.