ట్రంప్ H-1B వీసా ఫీజు రూల్స్.. సోమవారం TCS, Wipro లాంటి టెక్ స్టాక్స్ పరిస్థితి ఏంటి..?

ట్రంప్ H-1B వీసా ఫీజు రూల్స్.. సోమవారం TCS, Wipro లాంటి టెక్ స్టాక్స్ పరిస్థితి ఏంటి..?

అమెరికా చరిత్రలోనే సంచలమైన పాలనను కొనసాగిస్తున్నరా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. సగటు అమెరికన్ బెనిఫిట్స్ తర్వాతే ఎవరైనా అన్నట్లు ఆయన పాలన కొనసాగుతోంది. అమెరికాతో బిజినెస్ కావాలంటే అమెరికాలో ఫ్యాక్టరీలు పెట్టాలే.. తమ వాళ్లకు జాబ్స్ ఇవ్వాలే అన్నదే ట్రంప్ ఆశయం, నినాదం కూడా. హెచ్1బి వీసాలను చాలా సంస్థలు దుర్వినియోగం చేయటం ద్వారా అమెరికన్లకు నష్టం జరుగుతోందని.. ఇకపై పిచ్చ ట్యాలెంట్ ఉంటేనే అమెరికాలో జాబ్ అని ట్రంప్ తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తేల్చి చెప్పేస్తున్నాయి. 

ట్రంప్ తీసుకున్న కొత్త లక్ష డాలర్లకు హెచ్1బి వీసా నిర్ణయంతో అమెరికాలోని టెక్ కంపెనీలతో పాటు భారత దేశంలోని ఐటీ సేవల కంపెనీలు కూడా వణికి పోతున్నాయి. భారత ఐటీ కంపెనీలకు చెందిన 13వేల 396 మంది ప్రస్తుతం స్పాన్సర్డ్ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్నారు.  వీరిని కంపెనీలు అమెరికాలోనే ఉంచాలనుకుంటే ఖచ్చితంగా లాభాల్లో పదిశాతం అంటే 13.4 మిలియన్ డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, కాగ్నిజెంట్, ఎల్టిఐ మైండ్ ట్రీ వంటి కంపెనీలకు ఇది పెద్ద కష్టమైన నిర్ణయంగా తెలుస్తోంది. 

ఇదే క్రమంలో హెచ్1బి వీసాలను అత్యధికంగా వినియోగించుకుంటున్న అమెరికాలోని టాప్ టెక్ కంపెనీలైన ఎన్వీడియా, అమెజాన్, టెస్లా, మెటా, ఆల్ఫా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు కూడా ట్రంప్ నిర్ణయంతో ప్రతికూలతలను ఎదుర్కొంటాయని తెలుస్తోంది. ఈ సంస్థలు రానున్న రోజుల్లో ట్రంప్ చర్యల కారణంగా అమెరికా టెక్కీలను రిక్రూడ్ చేసుకుంటాయని నిపుణులు అంటున్నారు. అయితే భారత ఉద్యోగుల కంటే అమెరికన్ టెక్కీలు ఎక్కువ వేతనాలు డిమాండ్ చేస్తారు కాబట్టి వారి లాభాలపై ఆ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

ALSO READ : H1B వీసాపై ట్రంప్ నిర్ణయంతో కల్లోలం.. 

ఈ ప్రభాతవంతో సోమవారం భారతీయ ఈక్విటీ మార్కెట్లలో లిస్టెడ్ ఐటీ సేవల కంపెనీల షేర్లలో కల్లోలం తప్పదని తెలుస్తోంది. ఇదే క్రమంలో యూఎస్ టెక్ స్టాక్స్ కూడా మార్కెట్ల ప్రారంభం తర్వాత నష్టాలను చూడొచ్చని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న వీసా ఫీజు పెంపు నిర్ణయం భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య బంధాలను దెబ్బతీస్తుందని ఎస్ఎమ్సీ గ్లోబల్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ సీమా శ్రీవాస్తవ చెప్పారు. తప్పని పరిస్థితుల్లో అమెరికా క్లయింట్ల కోసం భారత టెక్ కంపెనీలు హెచ్1బి వీసా స్పాన్సర్ చేసి కొందరు ఉద్యోగులను అమెరికాలో ఉంచటం వల్ల లాభాల తగ్గటంతో పాటు ఇతర ఖర్చులను భారీగా పెంచొచ్చని సీమా అన్నారు.