
కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొద్దిరోజుల క్రితం GST రేట్లలో మార్పులు ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. అయితే GST రేట్ల కోతతో నిత్యవసర వస్తువుల ధర నుండి ద్విచక్ర వాహనాల వరకు ధరలు భారీగా పడిపోయాయి. పండగ సీజన్లో నిర్మలమ్మ అందించిన ఈ తీపి కబురుతో సామాన్యుడికి ఖర్చుల భారం మరింత తగ్గనుంది. ఇక వాహన తయారీ సంస్థలు కూడా బైకులు, ద్విచక్ర వాహనాల ధరలను తగ్గిస్తూ ప్రకటించాయి. అయితే ఏ కంపెనీ ఏ బైక్/ స్కూటర్ ధర ఎంత తగ్గించిందంటే...
సుజుకి మోటార్ సైకిల్ బైకులు, స్కూటర్ల ధరలు రూ.18,024 వరకు తగ్గనున్నాయి. వీటిలో జిక్సర్, జిక్సర్ SF, జిక్సర్ 250, జిక్సర్ SF 250, V-స్ట్రోమ్ SX వంటి మోడళ్లు సహా యాక్సెస్, అవెనిస్, బర్గ్‌మాన్ స్ట్రీట్, బర్గ్‌మాన్ స్ట్రీట్ EX ఉన్నాయి.
ఏ మోడల్ పై ఎంత తగ్గిందంటే:
ఆక్సెస్ – రూ. 8,523
అవనిస్ – రూ. 7,823
బర్గ్‌మాన్ స్ట్రీట్ - రూ. 8,373
బర్గ్‌మాన్ స్ట్రీట్ EX - రూ. 9,798
జిక్సర్ - రూ. 11,520
జిక్సర్ SF - రూ. 12,311
జిక్సర్ 250 – రూ. 16,525
జిక్సర్ SF 250 – రూ. 18,024
V-స్ట్రోమ్ SX – రూ. 17,982
TVS మోటార్ కంపెనీ TVS బైక్ ధరలను తగ్గించి కొత్త ధరల లిస్ట్ ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఈ బైక్‌లు మరింత తక్కువ ధరకు లభిస్తున్నాయి. రోనిన్ లైనప్‌లో ధరల తగ్గింపు వేరియంట్‌ను బట్టి రూ.11,200 నుండి రూ.14,330 మధ్య ఉంటుంది.
బేస్ వేరియంట్
లైట్నింగ్ బ్లాక్: పాత ధర రూ.1,35,990, కొత్త ధర రూ.1,24,790 అంటే రూ.11,200 తగ్గింది.
మాగ్మా రెడ్: పాత ధర రూ.1,38,520 కొత్త ధర రూ.1,27,090 అంటే రూ.11,430 తగ్గింది
మిడ్ వేరియంట్
గ్లేసియర్ సిల్వర్: పాత ధర రూ.1,60,510 కొత్త ధర రూ.1,47,290అంటే రూ.13,220 తగ్గింది
చార్‌కోల్ ఎంబర్: పాత ధర రూ.1,62,010 కొత్త ధర రూ.1,48,590 అంటే రూ.13,420 తగ్గింది
టాప్ వేరియంట్
నింబస్ గ్రే: పాత ధర రూ. 1,73,720, కొత్త ధర రూ.1,59,390 అంటే రూ. 14,330 తగ్గింది
మిడ్‌నైట్ బ్లూ: పాత ధర రూ.1,73,720 కొత్త ధర రూ.1,59,390 అంటే రూ.14,330 తగ్గింది
సవరించిన GST రేట్లతో TVS రోనిన్ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ.1,24,790 నుండి ప్రారంభమవుతుంది.
కీవే, జోంటెస్, క్యూజె మోటార్ అండ్ బెనెల్లి వంటి చైనా కంపెనీలు ఇండియాలో GST రేట్ల మార్పుతో కొత్త ధరలు ప్రకటించింది.
కీవే బైక్స్ కొత్త ధరలు
మోడల్
SR 125 రూ.6750 తగ్గింది
SR 250 రూ.8780 తగ్గింది
కె300ఎస్ఎఫ్ రూ.11,800 తగ్గింది
ఆర్ఆర్300 రూ.14,000 తగ్గింది
కె-లైట్250v రూ.19,000 తగ్గింది
వీస్టే 300 రూ.22,750 తగ్గింది
sixties300 రూ.23,000 తగ్గింది
వి302సి రూ.30,000 తగ్గింది
జోంటేస్ బైక్స్ ధరలు
మోడల్
350ఎక్స్ రూ.17,500 తగ్గింది
జికె350 రూ.24,200 తగ్గింది
350ఆర్ రూ.21,800 తగ్గింది
350టి రూ.23,350 తగ్గింది
350టిadv రూ.25,400 తగ్గింది
QJ మోటార్ బైక్స్ ధరలు
మోడల్
SRC 250 రూ.11,500 తగ్గింది
SRV 300 రూ.22,000 తగ్గింది
అయితే తగ్గించిన ఈ ధరలు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానుంది.