
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి.. గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. సాధారణంగా అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆదివారం.. అమావాస్య అయితే ఆరోజు చేసిన జపాలకు.. అనుష్టానాలకు ఎంతో శక్తి వస్తుందని పండితులు చెబుతున్నారు. సెప్టెంబర్ 21 ఆదివారం.. అమావాస్య సూర్యగ్రహణం.. పితృపక్షాల రోజు అన్నీ ఒకేరోజు వచ్చాయి. భారతదేశంలో కనిపించదు కాని.. పండితులు తెలిపిన వివరాల ప్రకారం సూర్య గ్రహణం సమయంలో ప్రజలు ఏం చేయాలి.. ఏం చేయకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. .
ఆదివారం.. అమావాస్య..సెప్టెంబర్ 21వ తేదీన ఆదివారం నాడు, సర్వ పితృ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. . ఆరోజుకు ఎంతో విశిష్టత ఉందని జ్యోతిష్యశాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఆరోజు ఆదివారం.. అమావాస్య సూర్యగ్రహణం.. పితృపక్షాల రోజు అన్నీ ఒకేరోజు వచ్చాయి.
సూర్యగ్రహణం సెప్టెంబర్ 21 రాత్రి 11 గంటలకు ప్రారంభమై.. 22న ఉదయం 3.24 గంటలకు ముగియనున్నది. గ్రహణ కాలంలో సూర్యుడు ... చంద్రుడు .. బుధుడు కన్య రాశిలో ఉంటారు. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. పసిఫిక్ దీవులు, అంటార్కిటికా, న్యూజిలాండ్.. తూర్పు ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది.
గ్రహణం సమయంలో చేయాల్సిన పనులు..
జపం.. అనుష్ఠానం: సూర్యగ్రహణం సమయంలో ప్రజలు నిశ్శబ్దంగా పీట కాని చాపపై కాని కూర్చుని అనుష్టానం చేయాలి. మంత్ర శక్తి ఉన్నవారు గ్రహణం ప్రారంభమైన దగ్గరి నుంచి విడిచేంతవరకు చేయాలి. మంత్ర అనుష్టానం లేని వారు విష్ణువు.... శివుడు ... దుర్గాదేవికి సంబంధించిన మంత్రాన్ని జపించమని సలహా ఇస్తారు. ఒకవేళ ఎలాంటి మంత్రము తెలియకపోతే ఓం అనే బీజాక్షరాన్ని జపం చేయాలంటున్నారు పండితులు. ఇలా చేయడం వలన అంతర్గతంగా శక్తి పెరుగుతుంది.
సూర్యగ్రహణ సమయంలో ప్రజలు లోపలే ఉండి మీ శక్తిని కాపాడుకోవాలి.
దర్భ... గరిక... తులసి: ఇంట్లో తినే పదార్దాలపై దర్భలు.. లేదా గరిక అది కూడా లభించని ఎడల తులసి దళాలు వేయాలి. అయితే ఆ రోజు తులలసి చెట్టును ఎట్టి పరిస్థితిలోతాకరాదు. ముందు రోజే తులసి దళాలను సిద్దం చేసుకోవాలి.
ఆధ్యాత్మిక గ్రంథాలు: గ్రహణ సమయంలో భగవంతుని ధ్యానం చేస్తూ ఉండాలి. రామాయణం.. మహాభారతం.. సుందరాకాండ.. భగవద్గీత వంటి ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించాలి.
దేవుడి విగ్రహాలు: గ్రహణ సమయంలో దేవుడి విగ్రహాలు.. చిత్ర పటాలపై క్లాత్ ను కప్పి ఉంచండి. తరువాత రోజు పటాలను.. విగ్రహాలను నీటితో శుద్ది చేసి.. పసుపు.. కుంకుమతో అలంకారం చేయాలి.
గంగాజలంతో శుద్ది: గ్రహణం వీడిన తరువాత.. ఇంటిని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత గంగాజలం చల్లండి.. ఆ వాటర్ లేకపోతే పుణ్య నదుల నీటిని కూడా చల్లవచ్చు.. అది కూడా లేని ఎడల పసుపు నీటిని చల్లండి.
పితృదేవతలకు తర్పణాలు వదలండి
చేయకూడని పనులు
- గ్రహణ సమయంలో ఎలాంటి ఆహార పదార్దాలు తీసుకోకూడదు.
- కొత్త పనులు ప్రారంభించకండి
- ఇంట్లో స్టవ్ వెలిగించకూడదు. గ్రహణ సమయంలో అగ్నిని ముట్టించకూడదు.
- బ్లేడు.. కత్తెర... చాకు లాంటి పదునైన వస్తువులను ఉపయోగించకండి
- దేవుడి పటాలను.. చిత్రపటాలను.. తులసి మొక్కను తాకకండి
- బ్రహ్మచర్యాన్ని పాటించండి.