
అమెరికా కాలమానం ప్రకారం 2025, సెప్టెంబర్ 21.. ఆదివారం అర్థరాత్రి 12 గంటలు.. ఆ రోజు సూర్యగ్రహం కూడానూ.. ఏ ముహూర్తాన ట్రంప్ ఈ టైం చూసి డెడ్ లైన్ పెట్టారో కానీ.. ఇండియన్ టెకీలకు మాత్రం కాళరాత్రినే.. సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం అర్థరాత్రి 12 గంటల దాటిన తర్వాత USలోకి ప్రవేశించే అవకాశం H-1B హోల్డర్‌కు ఉండదు. అమెరికాలోకి ప్రవేశ నిషేధం. కొత్త ఫీజు నిబంధన వర్తిస్తుంది. H1B వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఫైల్పై సంతకం చేసిన సంగతి తెలిసిందే. అమెరికాలోకి H-1B వీసా హోల్డర్స్ను అనుమతించాలంటే వాళ్లు పనిచేస్తున్న సంస్థ యాన్యువల్ ఫీజుగా లక్ష డాలర్లు (రూ. 88 లక్షలకు పైగా) చెల్లించాల్సిందే.
అమెరికా చేసిన ఈ ప్రకటనతో బిజినెస్ పని మీద గానీ, వెకేషన్పై గానీ వెళ్లిన ఉద్యోగులు సెప్టెంబర్ 21 అర్ధరాత్రి 12 గంటల లోపు అమెరికా చేరుకోవాలని అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ టెక్ కంపెనీలు ఉద్యోగులను హెచ్చరించాయి. H1B వీసాపై ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం ఎక్కువగా భారతీయులపైనే ఉండటం గమనార్హం. యూఎస్ సిటిజెన్ షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ప్రకారం.. 2022 అక్టోబర్ నుంచి సెప్టెంబర్ 2023 మధ్య కాలంలో సుమారు 4 లక్షల హెచ్1బీ వీసాలను భారతీయులకు అమెరికా మంజూరు చేసింది. అంటే.. H1B వీసాపై అమెరికాలో కొనసాగుతున్న వారిలో దాదాపు 72 శాతం భారతీయులే కావడం గమనార్హం.
ALSO READ : ప్రపంచం అంతా H-1B గందరగోళం : టికెట్ రేట్లు ట్రిపుల్..
సాధారణంగా హెచ్ 1 బీ వీసాలు టెక్నాలజీ రంగంలో పనిచేసే వారికే ఎక్కువగా ఇస్తారు. దీంతో అమెరికాలోని ప్రముఖ కంపెనీలు హెచ్ 1 బీ వీసా ద్వారా విదేశాల నుంచి ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులే ఇందులో ఎక్కువగా ఉంటారు. ఇతర రంగాల్లోఉద్యోగం చేసేందుకు వెళ్లే వారైనా సరే హెచ్ 1 బీ వీసాతో పనిచేస్తూ ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ లేదా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తుంటారు. ఇలా హెచ్ 1 బీ వీసా ద్వారా అమెరికా వెళ్లే వారిలో ఇండియన్సే 70 శాతం ఉంటారు. అమెరికాలో హెచ్ 1 బీ వీసాపై పనిచేస్తున్న వారంతా ఉద్యోగం కోల్పోతే తర్వాత రెండు నెలల లోపు తిరిగి వేరే ఉద్యోగంలో చేరాలి. లేదంటే వీసా రెన్యువల్ చేసుకోవాలి.
H-1B visa holders who are out of the US on business or vacation will get stranded unless they get in before midnight September 21. H-1Bs still in India may have already missed the deadline as there is no way a direct flight from India will get in time https://t.co/Ae2q6NKFCF
— Cyrus Mehta (@cyrusmehta) September 20, 2025