పద్మారావునగర్, వెలుగు: ప్రముఖ రచయిత్రి విజయభారతి (83) పార్ధివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీ అనాటమీ విభాగానికి కుటుంబసభ్యులు ఆదివారం అప్పగించారు. పద్మభూషన్ బోయి భీమన్న కుమార్తె, బొజ్జా తారకం సతీమణి, సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల బొజ్జా తల్లి అయిన విజయభారతి అనారోగ్యంతో శనివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. వైద్యవిద్యార్థుల పరిశోధనాల కోసం ఆమె పార్థివదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. గాంధీ దవాఖానాలో విజయభారతి మృతదేహానికి సంధ్య, గోరెటి వెంకన్న తదితరులు నివాళులర్పించారు.
