విమానంపై భలే భలే బొమ్మలు.. ముచ్చటగా ఉందంటూ కామెంట్స్

విమానంపై భలే భలే బొమ్మలు.. ముచ్చటగా ఉందంటూ కామెంట్స్

జపాన్ కి చెందిన భారత రాయబారి హిరోషి సుజుకీ చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. పిల్లలకు ఎంతో ఇష్టమైన కార్టూన్ పోకిమాన్ స్ఫూర్తితో, అందులో ప్రధాన క్యారెక్టర్లు పికాచు, డోరెమాన్ తదితర బొమ్మల్ని బోయింగ్ 787 అనే విమానంపై ముద్రించారు. ఇది తొలి సారి ఢిల్లీకి రావడంతో దీనికి సంబంధించిన ఫొటోని సుజుకీ ట్వీట్ చేశారు.  పికాచు విమానం భారత్ కి రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.  

ఈ ట్వీట్ కి నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.ట్విటర్లో 75 వేలకు పైగా వ్యూస్, 2,200కి పైగా లైక్ లను సంపాదించింది. దీన్ని వీక్షించిన ఇండియన్స్ హర్షం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. రంగురంగుల విమానం చాలా బాగుందని ఒకరంటే.. చిన్న పిల్లలను ఫ్లైట్ ఆకర్షిస్తోందని మరొకరు కామెంట్ చేశారు. పోకీమాన్, డోరేమాన్, షించాన్ పాత్రలు చూస్తుంటే తమ చిన్నతనం గుర్తొస్తోందని మరో నెటిజన్ అన్నారు.  విమానంలో సైతం పోకిమాన్ ప్రపంచాన్ని చూసినట్టుంటుంది. లోపల ఉన్న 200 సీట్లకు...  ఎగిరే పికాచు డిజైన్ తో అలంకరించారు.