
ఇటీవల కొత్తగూడెం రేంజ్ పరిధిలో చోటు చేసుకున్న ఓ ఘటనలో స్థానిక కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన కొడుకుపైనా ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించిన అధికారి బోగా నిఖితనే.
2017లో మూడో అటెంప్ట్‌లో ఐఏఎస్‌లో 934 ర్యాంకు, ఫారెస్ట్ అకాడమీలో 90వ ర్యాంకును సాధించారు బోగా నిఖిత. ఫారెస్ట్ అకాడమీలో చేరి రెండేళ్ల పాటు డెహ్రాడూన్‌లో శిక్షణ తీసుకుని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా కొత్తగూడెంలో రెండున్నర నెలలపాటు పనిచేశారు. ప్రస్తుతం ఆమెకు తెలంగాణ క్యాడర్లోనే ఐఎఫ్‌ఎస్ రావడంతో ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్‌గా సెప్టెంబర్ మొదటి వారంలో బాధ్యతలను చేపట్టనున్నారు.
హైదరాబాద్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తవ్వగానే క్యాంపస్ ఇంటర్య్వూల్లో టాటా ఎయిరో స్పేస్‌లో జాబ్ వచ్చింది. దాదాపు ఏడాదిన్నర పాటు అక్కడ పనిచేశాక రిజైన్ చేశా. సివిల్స్ ప్రిపేరవుదామని డిసైడయ్యా. కోచింగ్ కోసం బెంగళూర్ వెళ్లా. మూడో అటెంప్ట్‌లో వచ్చింది. ఏ గోల్ అయినా సరే రీచ్ అవ్వడానికి సరైన ప్లాన్ ఉండాలి. సాధించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఎక్కడా ఒత్తిడికి లోను కావద్దు. సివిల్స్ ప్రిపేరయ్యేవారికి గ్రూప్ డిస్కషన్స్ చాలా ఉపయోగపడతాయి. లక్ష్యాన్ని చేరుకునేవరకు ఎక్కడా ఏకాగ్రత కోల్పోవద్దు. నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. కలెక్టర్ నుంచి ప్రశంసాపత్రం అందుకున్నా. ఇప్పటికి ఖాళీ దొరికితే పెయింటింగ్ చేస్తుంటా. మా సొంతూరు కొత్తగూడెం అయినప్పటికీ బిజినెస్ వల్ల మా అమ్మానాన్న బోగా లక్ష్మి – వెంకటనారాయణ వరంగల్‌లో వచ్చి సెటిలయ్యారు. నేను ఫారెస్ట్ సర్వీస్ తీసుకుంటానంటే అడవుల్లో ఉద్యోగం ఎందుకు అంటూ మా రిలేటివ్స్ వద్దన్నారు. కానీ మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. వారిచ్చిన ప్రోత్సాహమే ఈ రోజు నన్ను ఐఎఫ్‌ఎస్ అధికారిగా నిలబెట్టింది. డ్యూటీలో రాజీపడడం నాకిష్టం లేదు.
ఇటీవల కొత్తగూడెం రేంజ్ పరిధిలో చోటు చేసుకున్న ఓ ఘటనలో స్థానిక కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన కొడుకుపైనా ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించా. ఓ వైపు ప్రభుత్వం హరితహారం పేరుతో అడవుల సంరక్షణకు చర్యలు తీసుకుంటుంటే ఇలా రిజర్వ్ ఫారెస్టు భూములను ఆక్రమించుకోవటం ఏంటని ప్రశ్నించాను. – భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు