నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం బోత్తులపాలెం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బొలెరో కారును డీసీఎం డీ కొట్టటింది. ఈ ఘటనలో బొలెరో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందగా..మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
టాటా నెట్వర్క్ చెందిన నలుగురు కార్మికులు కేబుల్ పనులు చేస్తుండగా ఘటన జరిగింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతులు దేవరకొండ ప్రాంతానికి చెందిన యాది (22),రిజ్వాన్ (36) గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వాడపల్లి పోలీసులు.