ఎన్టీఆర్ దేవరలో మరో బాలీవుడ్ యాక్టర్!

ఎన్టీఆర్ దేవరలో మరో బాలీవుడ్ యాక్టర్!

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్(Ntr)..బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్(Janhvi Kapoor) కలిసి నటిస్తున్న మూవీ దేవర(Devara). ఈ మూవీని డైరెక్టర్ కొరటాల శివ(Korata Siva) పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. గత ఎడాది RRR సినిమాతో అంతర్జాతీయా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్..ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

లేటెస్ట్గా దేవర నుంచి మరో ఇంట్రెస్టింగ్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సంజయ్ దత్(Sanjay Dutt) కీలక పాత్రలో కనిపించునున్నట్లు సమచారం. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక సంజయ్ దత్ నటిస్తున్నట్లు టాక్ వినిపించడంతో..ఫ్యాన్స్లో అంచనాలు పెరిగిపోయాయి. దేవరలో మరో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే సంజయ్ దత్ తెలుగులో K.G.F2,లియో మూవీస్ లో నటించి మెప్పించాడు. అలాగే రామ్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ లోను, మారుతి ప్రభాస్ కాంబోలోను నటిస్తున్నాడు. సౌత్ ఇండియాలోని సముద్ర తీర ప్రాంతాలలో దేవర వరుస షూటింగ్స్ జరుపుకుంటోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.