Tamannaah: బిలియన్ క్లబ్‌లో మిల్కీ బ్యూటీ.. యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా తమన్నా! ఎందుకంటే?

Tamannaah: బిలియన్ క్లబ్‌లో మిల్కీ బ్యూటీ.. యూట్యూబ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా తమన్నా! ఎందుకంటే?

బాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వరుస ఆఫర్స్ తో ఫుల్ జోష్ లో ఉంది.  వచ్చిన ప్రతి ఆఫర్ ను సద్వీనియోగం చేసుకుంటూ దూసుకెళ్తోంది. అది గ్లామర్ పాత్రలైనా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలైనా, లేదా ఊపేసే స్పెషల్ సాంగ్స్ అయినా.. ఇట్టే ఆకట్టుకుంటుంది.  లేటెస్ట్ గా తమన్నా ఖాతాలో ఒక రికార్డు వచ్చి చేరింది. ఆమె నటించిన 'ఆజ్ కీ రాత్' సాంగ్ యూట్యూబ్‌లో 1 బిలియన్ (100 కోట్లు) వ్యూస్ సాధించి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

బిలియన్ క్లబ్‌లో మిల్కీ బ్యూటీ హవా

గతేడాది బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలీవుడ్ హారర్ కామెడీ 'స్త్రీ 2'లో తమన్నా 'ఆజ్ కీ రాత్' అనే స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఈ పాటలోని ఆమె డ్యాన్స్ మూమెంట్స్, ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ పాట 100 కోట్ల వ్యూస్ మైలురాయిని దాటడంతో తమన్నా ఎమోషనల్ అయ్యారు. "మొదటి వ్యూ నుంచి వన్ బిలియన్ వరకు.. మీరు చూపిస్తున్న ఈ అంతులేని ప్రేమకు ధాంక్స్" అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : : కొడుకు చేసిన నేరానికి కోర్టుకెక్కిన తల్లి

శ్రీ నుంచి ఓదెల వరకు

2005లో 'చాంద్ సా రోషన్ చెహ్రా' అనే హిందీ చిత్రంతో కెరీర్ మొదలుపెట్టిన తమన్నా, అదే ఏడాది 'శ్రీ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'హ్యాపీ డేస్' ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత 100% లవ్, బద్రీనాథ్, రచ్చ, ఊపిరి, ఎఫ్ 2 వంటి చిత్రాలతో టాప్ హీరోయిన్‌గా గుర్తింపును సొంతం చేసుకుంది.  'బాహుబలి' చిత్రంలో అవంతికగా తమన్నా చేసిన సాహసోపేతమైన నటన ఆమెను గ్లోబల్ స్టార్‌ను చేసింది.  ఇటీవల 'ఓదెల 2'లో శివశక్తి పాత్రలో భిన్నమైన గెటప్‌తో ఆకట్టుకున్న ఆమె, ప్రస్తుతం హిందీలో మూడు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

ఐటమ్ సాంగ్స్‌తో  ట్రెండ్ సెట్టర్

హీరోయిన్‌గా రాణిస్తూనే, స్పెషల్ సాంగ్స్‌లో నటించడానికి తమన్నా ఎప్పుడూ వెనుకాడలేదు. ఆమె చేసిన ప్రతి పాట ఒక ట్రెండ్ సెట్టర్ నిలిచింది. వాటిల్లో ప్రధానంగా 'అల్లుడు శ్రీను ' మూవీలోని 'రావే నా లబ్బర్ బొమ్మ' ఐటమ్ సాంగ్స్‌తో ఆమె తొలి అడుగు వేసింది. 'జై లవకుశ' లో ఎన్టీఆర్‌తో కలిసి చేసిన 'స్వింగ్ జరా' డ్యాన్స్ నంబర్ అప్పట్లో పెద్ద హిట్ గా నిలిచింది. రజనీకాంత్ జైలర్ సినిమాలోని 'నువ్వు కావాలయ్యా' సాంగ్ కు స్టెప్పులతో గ్లోబల్ వైడ్ వైరల్ అయ్యింది. ఆతర్వాత 'రైడ్ 2'లో 'నషా' పాటతోనూ మరోసారి తన గ్లామర్ పవర్ చూపించారు

కేవలం అందం మాత్రమే కాదు, కఠినమైన డ్యాన్స్ మూమెంట్స్‌ను కూడా ఎంతో ఈజ్‌తో చేయగలగడం తమన్నా ప్రత్యేకత. అందుకే ఆమెను అభిమానులు 'డ్యాన్సింగ్ క్వీన్' అని పిలుచుకుంటారు. వెండితెరపై ఆమె ఇచ్చే ఆ 'నషా' ఇలాగే మరిన్ని బిలియన్ వ్యూస్ సాధించిపెట్టింది.