రేవతి డైరెక్షన్లో కాజోల్

రేవతి డైరెక్షన్లో కాజోల్

సీనియర్ నటి రేవతి దర్శకత్వంలో బాలీవుడ్ తార కాజోల్ నటిస్తోంది. ఈ సినిమాకు ‘సలాం వెంకీ’ టైటిల్ని ఖరారు చేసింది చిత్ర బృందం. సినిమాకు సంబంధించిన విషయాలను కాజోల్ తన ఇన్ స్టా ద్వారా ఫ్యాన్స్తో షేర్ చేసుకుంది. తాను రేవతితో ఉన్న పోటోను పోస్ట్ చేసిన కాజోల్... తన ఫీలింగ్స్ని కూడా కామెంట్స్ రూపంలో పంచుకుంది. ‘ ఓ మంచి కథతో, సరికొత్త మార్గంలో, జీవితానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చే ఓ సరికొత్త ప్రయాణాన్ని ఈ రోజు స్టార్ట్ చేశాం.  చాలా థ్రిల్లింగ్ గా ఉంది.’అంటూ కాజోల్ తన  ఇన్స్ట్రాలో  పోస్టు చేసింది.  కాగా జీవితంలో  జరిగిన ఓ యదార్థగాథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు రేవతి గతంలో పేర్కొంది. 

For More News..

ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్