Nora Fatehi: 5 నిమిషాల పాటకి రూ.3 కోట్లు తీసుకుంటున్న ఈ బ్యూటీ అప్పట్లో ఏం చేసేదో తెలిస్తే అవాక్కవుతారు.

Nora Fatehi: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా టర్న్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఐతే డబ్బు, ఆస్తులు, సపోర్ట్ ఉన్నవారికి ఇండస్ట్రీలోకి సులభంగా ఎంట్రీ లభించినప్పటికీ ఇవేమి లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్ట్రగుల్స్ ఎదుర్కొని అవకాశాలు దక్కించుకోలేక కెరీర్ ముగిసిపోయినవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే కష్టాలని ఎదుర్కొని అవకాశాలు వచ్చినప్పుడు చక్కగా సద్వినియోగం చేసుకుని ఇండస్ట్రీలో స్టార్ హోదాలో సెటిల్ అయినవారు కూడా లేకపోలేదు. పలు స్పెషల్ సాంగ్స్ తో అలరించిన బాలీవుడ్ ప్రముఖ నటి నోరా ఫతేహి కూడా ఈ కోవకే చెందుతుందని చెప్పవచ్చు. 

అయితే నోరా ఫతేహి కెనడాలో పుట్టిపెరిగింది. నోరా తల్లిదండ్రులు పేదరికంలో ఉండటంతో చదువుకునే సమయంలో తన తల్లిదండ్రులకి అండగా ఉండేందుకు పార్ట్ టైమ్ జాబ్ చేసేది. ఈ క్రమంలో స్కూల్ అయిపోగానే బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్ గా పనిచేశానని గతంలో నోరా పలు ఇంటర్వూ లలో తెలిపింది. 

అంతేగాకుండా చదవులు పూర్తయిన తర్వాత కొంతకాలంపాటూ కమీషన్ కోసం లాటరీ టికెట్లు కూడా అమ్మింది. ఆ తర్వాత యాక్టింగ్ పై ఆసక్తి కలగడంతో ఇండియాకి వచ్చే స్తోమత లేకపోయినప్పటికీ ఇండియా కి వచ్చి ఆఫర్ల కోసం కష్టపడింది. కానీ కెరీర్ మొదట్లో ఆశించిన స్థాయిలో ఆఫర్లు అందుకోలేకపోయింది. ఈ క్రమంలో ముంబైలోని ఓ ఏరియాలో ఇరుకు గదులలో ఉంటూ, తినడానికి సరైన తిండిలేక  సర్వైవ్ అవడానికి జూనియర్ ఆర్టిస్ట్ గా ట్రూప్ డాన్సర్ గా కూడా పని చేసింది.

ఈ క్రమంలో తెలిసినవారి ద్వారా ప్రముఖ బాలీవుడ్ హీరో అభినవ్ శుక్లా హీరోగా నటించిన రోర్ అనే సినిమాలో నటించే ఆఫర్ దక్కించుకుంది. ఈ సినిమాలో చిన్నపాత్రలో నటించి 2016 లో కెరీర్ ఆరంభించింది. ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో "మనోహరి" అనే స్పెషల్ సాంగ్ లో నటించగా ఈ ఆఫర్ నోరా కెరీర్ ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. 

ఆ తర్వాత సతేమేవ జయతే సినిమాలోని డిల్బర్ సాంగ్ తోఫెమస్ అయ్యింది. ఈ పాటలో బెల్లీ డ్యాన్స్ తో అదరగొట్టగా ఆడియన్స్ తోపాటూ దర్శక నిర్మాతలు కూడా ఫిదా అయ్యారు. ఇంకేముంది బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో కంటెస్టెంట్ గా ఆఫర్లు, స్పెషల్ సాంగ్స్ తో గత 4ఏళ్ళ నుంచి వరుస ఆఫర్లతో బిజీగా ఉంటోంది. అయితే ఒక్కోపాటకి సినిమా బడ్జెట్ ని బట్టి దాదాపుగా 2 నుంచి 5 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటోంది. అలాగే పెళ్లి పేరెంటాలలో డ్యాన్స్ చేయడానికి వెళితే ఒక్కరోజుకి దాదాపుగా రూ.1.5 కోట్లు తీసుకుంటోంది.