
ముంబయి: బాలీవుడ్ నటి యువికా చౌధరి నెటిజన్లకు సారీ చెప్పింది. ఒక వర్గం వారిని కించపరిచేలా ఉన్న పదాన్ని పొరపాటున ఉపయోగించాను క్షమించమంటూ రెండు చేతులు జోడించి వేడుకుంది. ఇన్‌స్ట్రామ్‌లో చేతులు జోడించి ఆమె నెటిజన్లకు క్షమాపణలు చెప్పింది. నటులు, సెలబ్రిటీలు అలవాటులోనో లేదా ఫ్లోలో.. పొరపాటున.. క్షణికావేశంలో నోరు జారి ఇబ్బందులు చుట్టుముట్టాక క్షమాపణలు చెప్పడం సర్వ సాధారణమే అయితే ఏకంగా అరెస్ట్ చేయాలనేంత డిమాండ్ బహుశా బాలీవుడ్ నటి యువికా చౌదరి విషయంలోనే జరిగినట్లుంది. తమను కించపరిచేలా కామెంట్ చేసిందంటూ #ArrestYuvikaChaudhary హ్యాష్ ట్యాగ్‌తో విరచుకుపడ్డారు నెటిజనులు.
నిమ్నవర్గాల వారిని కించపరిచేలా ఉన్న ఆ పదాన్ని 20 ఏళ్ల క్రితమే నిషేధించారు. ఈ విషయం గుర్తించనందుకు యువికా చౌధరి నెటిజన్లకు క్షమాపణ ద్వారా మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చింది.తనను ఏకంగా అరెస్టు చేయాలనే డిమాండ్ తో నెటిజన్లు ట్రోలింగ్స్ చేయడం ప్రారంభించడంతో వెంటనే దిద్దుకునేందుకు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో క్షమాపణ వీడియో పెట్టింది యువికా. బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు పొందిన యువికా చౌధరి ‘ఫిర్ బీ దిల్ హై హిందుస్థానీ’, ఓం శాంతి ఓం లాంటి సినిమాలతో పాటు డజనుకి పైగా టీవీ షోలతో ఉత్తరాదిలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాను మాట్లాడేటప్పుడు తాను సోయి లేకుండా వ్యవహరించానని, ఆ అర్థంతో మాట్లాడలేదని వివరణ ఇచ్చుకుంది. తన వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే, బాధపడి ఉంటే క్షమించాలని వీడియోలో ఆమె కోరింది. తనకు ఎవరీని నొప్పించే ఉద్దేశం లేదని ట్విట్టర్లో ఓ ట్వీట్ చేసింది యువికా చౌధరి.