పెళ్ళికంటే ముందు శారీరకంగానే.. క్రేజీ లవ్ స్టోరీ చెప్పిన విద్యా

పెళ్ళికంటే ముందు శారీరకంగానే.. క్రేజీ లవ్ స్టోరీ చెప్పిన విద్యా

బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్(Vidya balan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియా వైడ్ గా ఆమెకు, ఆమె సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఇక విద్యా బాలన్ ప్రధాన పాత్రలో  వచ్చిన "ది డర్టీ పిక్చర్(The Dirty picture)" సినిమా ఆమెను స్టార్ హిరోయిన్ ను చేసింది. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమా.. దేశవ్యాప్తంగా రిలీజైన అన్నీ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాదు.. ఈ సినిమాలో విద్యబాలన్ నటనకు జాతీయ అవార్డు కూడా వరించింది. 

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విద్యాబాలన్.. తన సినిమా జీవితం, ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్, విద్యాబాలన్ ను తన భర్త, ప్రముఖ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్(Siddarth roy kapoor) తో రిలేషన్ గురించి ప్రశ్నలు అడిగింది.

దానికి విద్యా సమాధానం ఇస్తూ.. "నాది సిద్దార్థ్ ది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నిజానికి సిద్దార్థ్ చాలా అందంగా ఉంటాడు. అందుకే మేము ముందుగా శారీరకంగా ఆకర్షితులమయ్యాం. ఆ తరువాత ఒకరోజు సిద్దార్థ్ నాకు ప్రపోజ్ చేశారు. తాను నన్ను చాలా సెక్యూర్ గా చూసుకునే వారు. సిద్దార్థ్ లో ఆ లక్షణం నాకు బాగా నచ్చేది. అందుకే వెంటనే ఓకే చెప్పేసి పెళ్లిచేసుకున్నాం అని చెప్పుకొచ్చింది విద్యా బాలన్. ప్రస్తుతం విద్యా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.