
ప్రభాస్(Prabhas) రాముడిగా నటించిన ఆదిపురుష్(Adipurush) సినిమాపై ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సంచలన కామెంట్స్ చేశాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) తెరకెక్కించిన ఈ సినిమా భారీ గందరగోళాన్ని సృష్టించింది అంటూ తనదైన స్టైల్లో కౌంటర్ వేశాడు తరణ్ ఆదర్శ్.
సినిమా చూసిన తరువాత తరుణ్ ఆదర్శ్ స్పందిస్తూ.. "ఈ చిత్రం తనను పెద్ద ఎత్తున నిరాశపరిచిందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు రేటింగ్ కూడా చాలా తక్కువగా ఇచ్చాడు. “ఆదిపురుష్ అనేది ఒక నిరాశజనకమైన ఇతిహాసం. సినిమాపై ఏర్పడిన భారీ అంచనాలను దర్శకుడు ఓం రౌత్ అందుకోలేకపోయాడు. స్టార్ కాస్ట్, భారీ బడ్డెట్‌తో భారీ గందరగోళాన్ని సృష్టించాడు.” అంటూ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం తరుణ్ ఆదర్శ్ ఆదిపురుష్ సినిమాపై ఇచ్చన ఈ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి కూడా మిక్సుడ్ టాక్ వచ్చింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ డైరెక్టర్ ఓం రౌత్ పై మండిపడుతున్నారు.