వివాదంలో పవన్ కల్యాణ్ హీరోయిన్​

వివాదంలో పవన్ కల్యాణ్ హీరోయిన్​

బాలీవుడ్​ హీరోయిన్​ అమిషా పటేల్​సిక్కు భక్తుల ఆగ్రహానికి గురైంది. ఇటీవల ‘ఆదిపురుష్’​ డైరెక్టర్ ​ఓం రౌత్, కృతిసనన్​ తిరుమల కొండపై ఆలింగనంతో పలకరించుకోవడం వివాదంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా అమిషా పటేల్​ సైతం అచ్చం ఇలాంటి చిక్కుల్లోనే పడింది. బాలీవుడ్​ బ్లాక్​బస్టర్ ​‘గదర్’​ సినిమా సీక్వెల్​లో అమిషా పటేల్ హీరోయిన్​గా నటిస్తోంది. సిక్కుల పవిత్ర స్థలమైన గురుద్వారాలో కొన్ని సీన్లకు మూవీ టీం అనుమతులు తీసుకుంది. హీరో సన్నీ డియోల్​తో షూట్ ​చేసిన కొన్ని సీన్లు ఇంటర్​నెట్​లో వైరల్​ అయ్యాయి. ఇందులో వారిద్దరూ సన్నిహితంగా కనిపించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గురుద్వారా నిర్వహకులు సైతం దీనిపై మండిపడుతున్నారు. వీరు క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు ట్రోల్ ​చేస్తున్నారు. అమిషా పటేల్ ​తెలుగులో పవన్​కళ్యాణ్​తో బద్రి, మహేశ్​బాబుతో నాని, జూనీయర్ ఎన్టీఆర్​తో నరసింహుడు వంటి సినిమాలు చేసింది.