మొన్న రష్మిక.. ఇప్పుడు కాజోల్.. మరో డీప్ ఫేక్ వీడియో వైరల్

మొన్న రష్మిక.. ఇప్పుడు కాజోల్.. మరో డీప్ ఫేక్ వీడియో వైరల్

ఇటీవల నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) కి సంబందించిన డీప్ ఫేక్ వీడియో(Deep Fake video) వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియో నేషనల్ వైడ్ సంచలనంగా మారింది. డీప్ నేక్ తో కాస్త వల్గర్ ఉన్న వీడియోకి రష్మిక మొహాన్ని యాడ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు కొందరు ఆకతాయిలు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. 

ఈ డీప్ ఫేక్ వీడియోపై దాదాపు టాప్ సెలబ్రెటీస్ అందరు స్పందించారు. ఇలాంటి వారిని ఉపేక్షించకూడదని, ఆ వీడియో చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతే వేగంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి.. ఆ వీడియో చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. 

ఇదిలా ఉంటే.. తాజాగా మరో స్టార్ హీరోయిన్ డీప్ ఫేక్ వీడియో వైరల్ గా మారింది. ఈసారి బాలీవుడ్ స్టార్ కాజోల్(Kajol) ను టార్గెట్ చేశారు. ఆ వీడియోలో ఎవరో బట్టలు మార్చుకున్నట్లుగా ఉంది. దానికి కాజోల్ పేస్ ను యాడ్ చేసి వీడియో క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా లెక్కచేయకుండా.. ఇలాంటి అసభ్యకరమైన వీడియోలు చేస్తున్న ఆకతాయిలపై ఎలాంటి యాక్షన్ తీసుకోనున్నారో చూడాలి.