
దాదాపు పాతికేళ్ల తరువాత టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నారు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్(Sanjay datt). తాజాగా ఆయన డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్(Puri Jagannadh) తెరకెక్కిస్తున్న డబుల్ ఇస్మార్ట్(Double Ismart) మూవీలో యాక్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అండ్ సంజయ్ దత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో సంజయ్ బిగ్ బుల్ అనే పాత్రలో కనిపంచనున్నారు. ఈ లుక్ లో సంజయ్ చాలా స్టైలీష్ గా కనిపిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ మూవీ పాన్ ఇండియా లెవల్లో రానుంది కాబట్టి.. బాలీవుడ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని సంజయ్ ని ఈ సినిమాలో తీసుకున్నారని సమాచారం.
ఇక యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా 2019 వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar) మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతోంది డబుల్ ఇస్మార్ట్ మూవీ. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవలే డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. అప్పటినుండే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టుకుంది ఈ సినిమా. 2024 మార్చ్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
Double ISMART is now Double MASS??
— Puri Connects (@PuriConnects) July 29, 2023
Team #DoubleISMART welcomes on board the powerhouse performer @duttsanjay for the most dynamic role #BIGBULL ❤️?#HBDSanjayDutt
IN CINEMAS MARCH 8th, 2024?
Ustaad @ramsayz #PuriJagannadh@Charmmeofficial @IamVishuReddy @PuriConnects pic.twitter.com/DeoRFFkFeH