టైగర్ అభీ జిందా హై: అసెంబ్లీ ఫలితాల వేళ బీహార్‎ సల్మాన్ ఖాన్ అంటూ నితీష్ పోస్టర్లు

టైగర్ అభీ జిందా హై: అసెంబ్లీ ఫలితాల వేళ బీహార్‎ సల్మాన్ ఖాన్ అంటూ నితీష్ పోస్టర్లు

రేపే బీహార్ ఎన్నికల ఫలితాలు
= రాష్ట్రంలో టైగర్ జిందాహై అంటూ నితీశ్ పోస్టర్లు
= రెండు దశల్లో 243 స్థానాలకు ఎన్నికలు
= ఎన్డీఏకే జై కొట్టిన ఎగ్జిట్ పోల్ పలితాలు
= మరికొద్ది గంటల్లో తేలనున్న ఓటరు నాడి 

పాట్నా: బీహార్ ఎన్నికల ఫలితాలు 2025, నవంబర్ 14న విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ పత్రాలు లెక్కింపు ఉండగా.. అనంతరం ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర ఈవీఎంలకు గట్టి భద్రతా ఏర్పాటు చేశారు. బీహార్‎లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరిగింది. ఇప్పటి వరకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏకే పట్టం కట్టాయి. దీంతో అధికార కూటమిలో ఫుల్ జోష్ నెలకొంది.  

ఇదిలా ఉండగా.. పాట్నాలో నితీష్ కుమా పోస్టర్లు  వెలిశాయి.  ‘టైగర్ జిందా హై’ అనే బ్యానర్‎తో నితీష్ కుమార్ పోస్టర్లు వెలిశాయి. తిరిగి అధికారంలోకి రాబోతున్నామనేందుకు సంకేతంగా ఈ పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇక ఎగ్జిట్ పోల్ సర్వేలను మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ తిరస్కరించారు. కచ్చితంగా రాష్ట్రంలో మార్పు జరుగుతుందని తెలిపారు. శుక్రవారం సర్వేల అంచనాలు తారుమారు అవుతాయని చెప్పారు.