ఎల్బీ నగర్ లో బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు

ఎల్బీ నగర్ లో బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు

ఎల్బీనగర్, వెలుగు: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు రావడంతో సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్ జోన్ లో పలు ప్రదేశాల్లో బాంబు, డాగ్ స్క్వాడ్ టీమ్స్ శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాయి. చాలా కాలం నుంచి పార్క్ చేసిన వెహికల్స్, రద్దీ ప్రదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బస్సులు, చెత్తకుప్పల వద్ద తనిఖీలు చేశారు. వెహికల్స్ కింది భాగంతో పాటు వెహికల్స్ లో కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీలు ఇక ముందు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.