హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు

హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న సిటీ సివిల్ కోర్టులో బాంబులు పెట్టామని.. పెట్టిన బాంబు కాసేపట్లో పేలిపోతాయి అంటూ ఓ వ్యక్తి కోర్టుకు కాల్ చేశాడు. 2025, జూలై 8వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో ఈ కాల్ వచ్చినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు కోర్టు సిబ్బంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో సిటీ సివిల్ కోర్టుకు చేరుకున్నారు పోలీసులు. 

చీఫ్ మెజిస్ట్రేట్, ఇతర కోర్టు హాలులు అన్ని మూసివేశారు. కోర్టులోని ఉన్న సిబ్బందిని, జడ్జీలను, లాయర్లను ఖాళీ చేయించారు. బయటకు పంపించారు. సిటీ సివిల్ కోర్టులోని అన్ని గదులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కోర్టు ఆవరణలోనూ తనఖీలు చేశారు పోలీసులు.

ALSO READ : 'మా నాన్న మొత్తం పోలీస్ స్టేషన్‌నే కొనేస్తాడు': రాజకీయ నేత కొడుకుపై పోలీస్ కేసు..

కోర్టులో బాంబు పెట్టమని దుండగులు సమాచారం అందించటంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన కోర్టుకు చేరుకున్నారు. ఉన్నపలంగా కోర్టు కోర్టు కార్యకలాపాలన్నీ నిలిపివేసి, లాయర్లు, ప్రజలను బయటికి పంపి తనిఖీలు చేపట్టారు పోలీసులు. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలతో కోర్టు ఆవరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. 

అయితే.. ఈ బెదిరింపుల్లో నిజం ఉందా లేదా అన్నది పోలీసులు తనిఖీల తర్వాత తేలనుంది.. బెదిరింపులు ఎవరి నుంచి వచ్చాయి.. బెదిరింపుల వెనక ఎవరి హస్తమైన ఉందా లేక ఇవి ఫేక్ కాల్ బెదిరింపులా అన్నది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.