
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) నాయకుడు జావేద్ షేక్ కుమారుడు రహిల్ షేక్‌పై మరాఠీ కంటెంట్ క్రియేటర్ రాజశ్రీ మోర్ పోలీస్ కంప్లేన్ట్ నమోదు చేసారు. మద్యం మత్తులో కారు నడుపుతూ తనను తిట్టడమే కాకుండా, పోలీస్ స్టేషన్‌లో పోలీసులను కూడా బెదిరించాడని ఆమె వెల్లడించింది.
గత ఆదివారం రాత్రి ముంబైలోని అంధేరి సమీపంలో రహిల్ షేక్ మద్యం తాగి కారు నడుపుతున్నాడని రాజశ్రీ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా ఆమె షేర్ చేసింది. ఆ వీడియోలో రహిల్ షర్ట్ లేకుండా ఉన్నాడని, తనని తిడుతూ, బెదిరిస్తూ ఈ విషయాన్ని మా నాన్న చూసుకుంటాడు అని అరుస్తున్నాడని ఆమె తెలిపారు.
ఈ ఘటన తర్వాత రాజశ్రీ రహిల్ షేక్‌పై ఎఫ్ఐఆర్ (FIR) ఫైల్ చేశారు. అయితే పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత కూడా రహిల్ క్షమాపణ చెప్పకుండా మరింత దురుసుగా ప్రవర్తించాడని రాజశ్రీ తెలిపారు. అతను పోలీసులు పనిచేసే టేబుల్‌పై కాళ్ళు పెట్టి హిందీలో మా నాన్న ఇక్కడికి వస్తే, మొత్తం పోలీస్ స్టేషన్‌నే కొనేస్తాడు అని అన్నట్లు రాజశ్రీ వివరించారు.
ALSO READ : జూలై 24న హాజరుకండి .. సీఎస్, ముగ్గురు ఐఏఎఎస్లకు హైకోర్టు నోటీసులు
కొంతసేపటి తర్వాత రహిల్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వచ్చారని తమ కొడుకు పై ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయొద్దని కోరారని రాజశ్రీ తెలిపారు. రహిల్ చాలా మంచివాడు అని అతని తల్లి నాకు చెప్పింది. కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలని కోరుతూ, దీని వల్ల అతని లైఫ్, కెరీర్ నాశనం అవుతుందని అన్నది. కానీ అతనికి ఎలాంటి కెరీర్ ఉంది ? మద్యం మత్తులో కారు నడుపుతూ అతను దాదాపుగా చంపిన ఆ ముగ్గురి భవిష్యత్తు సంగతేంటి?" అంటూ రాజశ్రీ ప్రశ్నించారు. చివరికి రాజశ్రీ ఫిర్యాదు మేరకు పోలీసులు రహిల్ షేక్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.