పతంజలికి రూ.50 లక్షల ఫైన్

పతంజలికి రూ.50 లక్షల ఫైన్

ముంబై: పతంజలి ఆయుర్వేద్​ సంస్థకు బాంబే హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది. కర్పూరం ఉత్పత్తులను విక్రయించకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు కోర్టు ఈ ఫైన్​వేసింది. మంగళం ఆర్గానిక్స్ తమ కర్పూర ఉత్పత్తుల కాపీరైట్‌‌ను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ పతంజలి ఆయుర్వేద్​పై దావా వేసింది. దీంతో కర్పూరం ఉత్పత్తులను విక్రయించడం లేదా ప్రచారం చేయడం వంటివి చేయొద్దని పతంజలిని ఆదేశిస్తూ.. ఆగస్టు 2023లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పతంజలి ఆయుర్వేద్​ లిమిటెడ్ దాని కర్పూర ఉత్పత్తులను విక్రయిస్తోందని మంగళం ఆర్గానిక్స్ కోర్టుకు సమాచారం ఇచ్చింది. దీనిపై అఫిడవిట్​సమర్పించాలని  పతంజలిని కోర్టు ఆదేశించింది. జూన్‌‌లో పతంజలి అఫిడవిట్​ను సమర్పించింది. కోర్టు ఉత్తర్వుల తర్వాత రూ.49,57,861ల విలువైన కర్పూరం ఉత్పత్తి, సరఫరా జరిగిందని తెలిపింది. దీంతో రూ.50 లక్షలు డిపాజిట్ చేయాలని పతంజలి ఆయుర్వేద్‌‌ను  బాంబే హైకోర్టు ఆదేశించింది.