నవీముంబై ఎయిర్ పోర్టులో సర్వీసులు ప్రారంభం..తొలిరోజు 30విమానాలు..4వేల ప్యాసింజర్లు

నవీముంబై ఎయిర్ పోర్టులో సర్వీసులు ప్రారంభం..తొలిరోజు 30విమానాలు..4వేల ప్యాసింజర్లు

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం(NMIA)  నుంచి విమాన సేవలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గురువారం(డిసెంబర్ 25న) గౌతమ్ అదానీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ రోజు సుమారు 4వేల మంది ప్రయాణికులను 9 దేశీయ గమ్యస్థానాలకు చేర్చనున్నారు. 30 విమానాలను నడపనున్నారు.  

ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశా ఎయిర్ , స్టార్ ఎయిర్ వంటి ఎయిర్ సర్వీసులు  సేవలందించనున్నాయి. గురువారం నుంచి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విమానాలు నడుస్తాయి. ఫిబ్రవరి 2026 నాటికి  24 గంటల సేవలను విస్తరించాలని యోచిస్తున్నారు.అదానీ గ్రూప్  అనుబంధ సంస్థ అయిన అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్, ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తోంది.

మొదటి రోజు (గురువారం) మొత్తం 30 విమానాలు నడుపనున్నారు. రాకపోకలకు షెడ్యూల్ సమానంగా విభజించారు. దేశంలోని 9 ప్రాంతాలకు విమానాలు నడుస్తాయి.  ఇండిగో సంస్థ హైదరాబాద్ నుంచి తొలి విమానాన్ని నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు నడుపుతోంది.  దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి ఎయిర్ ఇండియా, ఆకాశా, స్టార్ ఎయిర్ లైన్స్ లు విమాన సర్వీసులు నడపనున్నాయి. 

తొలిరోజు 4వేల మందికి పైగా ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేర్చునున్నట్లు  విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు. ప్రారంభ దశలో విమానాశ్రయం రోజుకు 12 గంటలు అంటే ఉదయం 08:00 నుంచి రాత్రి 20:00 గంటల వరకు పనిచేస్తుంది. ఈ సమయంలో 13 ప్రాంతాలకు సర్వీసు సేవలు అందిస్తుంచనుంది. గంటలకు గంటకు 10 విమానాలతో  ప్యాసింజర్లకు సర్వీసు అందించనుంది.  

నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIAL) పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం కింద నిర్మించారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ 74శాతం వాటాను కలిగి ఉండగా..మిగిలిన 26శాతం వాటా మహారాష్ట్ర సిటీ & ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (CIDCO) షేర్ చేసుకుంది. 

ఇండిగో ఎయిర్ లైన్స్ దేశంలో అనేక ప్రాంతాలకు ఇక్కడినుంచి సేవలందించనుంది.  అహ్మదాబాద్, గోవా, కొచ్చి , ఢిల్లీ వంటి ముఖ్య నగరాలకు ఆకాశా ఎయిర్ సేవలను అందిస్తుంది. ఎయిర్ ఇండియా బెంగళూరు ,ఢిల్లీలను కలుపుతూ విమానాలను నడుపనుంది. ఢిల్లీ మార్గాలలో ఇండిగో, ఎయిర్ ఇండియా , ఆకాశా ఎయిర్ నుంచి రోజువారీ విమానాల రాకతో, ప్రారంభ రోజున అత్యధిక ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది.