V6 News

కేడీ జాదవ్‌‌‌‌కు పద్మ విభూషణ్‎పై మే 4లోగా తేల్చండి.. కేంద్రానికి బాంబే హైకోర్టు ఆదేశం

కేడీ జాదవ్‌‌‌‌కు పద్మ విభూషణ్‎పై మే 4లోగా తేల్చండి.. కేంద్రానికి బాంబే  హైకోర్టు ఆదేశం

ముంబై: ఇండియాకు తొలి వ్యక్తిగత ఒలింపిక్ పతకాన్ని అందించిన దిగ్గజ రెజ్లర్ ఖషాబా దాదాసాహెబ్ జాదవ్‌‌‌‌ (కేడీ జాదవ్‌‌‌‌)కు మరణానంతరం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించే అంశంపై మే 4వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

మహారాష్ట్రకు చెందిన జాదవ్ 1952 హెల్సింకి ఒలింపిక్స్‌‌‌‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించారు. జాదవ్‌‌‌‌ను గుర్తించాలని జాదవ్ కుటుంబం ఎన్నో ఏండ్లుగా విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో  ఆయన కుమారుడు రంజిత్ జాదవ్ స్థాపించిన ‘కుస్తీవీర్ ఖాషాబా జాదవ్ ఫౌండేషన్’ కోర్టులో పిల్ దాఖలు చేసింది.