అంటాల్య (టర్కీ): ఇండియా టాప్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్... ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–3 పోటీల్లో మెరిశాడు. శుక్రవారం జరిగిన మెన్స్ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్స్‌లో ధీరజ్ 6–2తో మాస్సిమిలియానో మాండియా (ఇటలీ)పై గెలిచారు. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్‌లో 6–2తో మహ్మద్ హుస్సేన్ గోల్షానీ (ఇరాన్)ను ఓడించాడు.
