నీలోఫర్, ఎంఎన్జేలో బోనాల పండుగ

నీలోఫర్, ఎంఎన్జేలో బోనాల పండుగ

మెహిదీపట్నం వెలుగు: నీలోఫర్ హాస్పిటల్​లోని బంగారు లక్ష్మీదేవి, ఎంఎన్ జే హాస్పిటల్​లోని కనకదుర్గ ఆలయంలో మంగళవారం బోనాల ఉత్సవాలు నిర్వహించారు. నీలోఫర్​సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్, సీఎస్ ఆర్ఎంవో డాక్టర్ నాగజ్యోతి, డిప్యూటీ సీఎస్ డాక్టర్ లాలూప్రసాద్, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎంఎన్ జే లో కనకదుర్గ ఆలయ కమిటీ చైర్మన్ శివకుమార్, టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ పాల్గొన్నారు.