
కరీంనగర్ సిటీ, వెలుగు: నగరంలోని స్థానిక బోయవాడలోని శ్రీ చైతన్య పాఠశాలలో ముందస్తు బోనాల పండగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు బోనం ఎత్తుకున్నారు. పిల్లలు సంప్రదాయ దుస్తులు ధరించి తమ ఇంటి నుంచి బోనాలను తయారు చేసుకొని వచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ న్యాలకొండ పద్మజ, ఏజీఎం ఎం రాజు, కోఆర్డినేటర్ నూరి, ఇంచార్జ్ గురుప్రిత్ కౌర్ పాల్గొన్నారు.
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ సిటీలోని పలు స్కూళ్లల్లో శనివారం ఘనంగా బోనాల పండగ ఉత్సవాలు జరిగాయి.
భగత్‌నగర్ లోని అద్విత ఇంటర్నేషనల్ స్కూళ్లో జరిగిన సంబరాల్లో ప్రిన్సిపల్ శ్వేతతో కలిసి డైరెక్టర్ సౌగాని అనుదీప్ పాల్గొన్నారు. సిటీ శివారు బొమ్మకల్ లోని ట్రినిటి ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్ లో జరిగిన బోనాల సెలబ్రేషన్స్ ల్లో ప్రిన్సిపల్ రత్నమాలతో కలిసి చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయలకు ప్రతీక అని ప్రశంసించారు.