
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయం బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి మహిళలు సందడి చేశారు. మంగళవారం వేలాది మంది నెత్తిన బోనాలతో ఆలయానికి తరలివెళ్లారు. ‘ తల్లి దీవించు’ అంటూ బోనాలు చెల్లించి, మొక్కులు సమర్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రాజన్న దర్శనం తర్వాత బద్ది పోచమ్మకు సంప్రదాయంగా మొక్కులు చెల్లిస్తుంటారు. శ్రావణ మాసం ముగుస్తుండడంతో వేలాది మంది మహిళలు గంటల తరబడి క్యూలెన్లలో ఉండి అమ్మవారికి మొక్కులు చెల్లించారు.