ఎడపల్లి, వెలుగు : మండలంలో ని జైతాపూర్ గ్రామంలో ఆదివారం బోనాల పండగ ఘనంగా జరిగింది. గ్రామంలో ఎల్లమ్మ మందిరం ఐదేళ్ల వార్షికోత్సవం, మహాలక్ష్మి మందిరం మొదటి వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో బోనాల పండగ నిర్వహించారు. పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ, ఎల్లమ్మ, మహాలక్ష్మి దేవతలకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
