గుమ్మడిదల గ్రామంలో రేణుకా ఎల్లమ్మతల్లికి బోనాలు సమర్పించిన భక్తులు

గుమ్మడిదల గ్రామంలో రేణుకా ఎల్లమ్మతల్లికి బోనాలు సమర్పించిన భక్తులు

పటాన్​చెరు, (గుమ్మడిదల), వెలుగు: గుమ్మడిదల గ్రామంలో ఆదివారం రేణుకా ఎల్లమ్మతల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గుమ్మడిదల మున్సిపల్​ కమిషనర్​ దశరథ్​ రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు బోనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాలు

జోగిపేట: పట్టణంలోని 17వ వార్డు తూర్పు గైని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించారు. ఆషాఢ మాసం పురస్కరించుకొని మహిళలు డప్పు చప్పుళ్లతో శోభాయాత్రగా వెళ్లి  పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. అనంతరం ముదిరాజ్ సంఘంలో ప్రతిష్ఠించిన మహంకాళి అమ్మవారి ఊరేగింపు తీశారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగభూషణం, పీఆర్​టీయూ జిల్లా అధ్యక్షుడు మానయ్య, వెంకటేశం, విఠల్, ప్రవీణ్, సత్యనారాయణ, ప్రకాశ్, శివయ్య, రాములు, దానయ్య, వెంకటేశ్, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అమ్మవారి దయతో కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి

సిద్దిపేట రూరల్: అమ్మవారి దయతో కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆయన హయాంలోనే బోనాల పండుగను రాష్ర్ట పండుగగా చేసుకున్నామని ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవ రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలో కౌన్సిలర్ సాయన్నగారి సుందర్ ఆధ్వర్యంలో బోనాల పండుగ సందర్భంగా ప్రశాంత్ నగర్ లో నిర్వహించిన పలహారం బండి కార్యక్రమంలో పాల్గొన్నారు.