
పాల్వంచ, వెలుగు : శ్రావణమాసం చివరి ఆదివారం కావడంతో పాల్వం చ పట్టణం, మండల వ్యా ప్తంగా భక్తులు అమ్మవార్లకు పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించారు. పాత పాల్వంచలోని శాంభవి మాత ఆలయ తొలి వార్షికోత్స వాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వేడుకల్లో చివరి రోజైన ఆదివారం ఘనంగా బోనాల పండుగ జరిగింది. ఆలయ ప్రధాన పూజారి సతీశ్ కుమార్ శర్మ నేతృత్వంలో నిర్వ హించిన ఈ కార్యక్రమంలో పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
ముత్యాలమ్మ తల్లికి మొక్కులు..
జూలూరుపాడు/ములకలపల్లి: ములకలపల్లి మండలంతోపాటు జూలూరుపాడు మండల పరిధిలోని కరివారిగూడెం, వెంగన్నపాలెం, కాకర్ల, పడమటి నర్సాపురం, పాపకొల్లు గ్రామంలోని మహిళలు ముత్యాలమ్మ తల్లికి పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పిండివంటలతో పాటు , పాయసం తయారు చేసి బోనాన్ని ఎత్తుకొని డప్పు వాయిద్యాలతో ఆలయం వరకు ఊరేగింపుగా బయలుదేరిబోనాలు సమర్పించారు. ఆయురారోగ్యాలను , అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నారు.