నటి శ్రీదేవి ఆకలితో ఏడ్చేది.. మలమల మాడేది.. : భర్త బోనీకపూర్

నటి శ్రీదేవి ఆకలితో ఏడ్చేది.. మలమల మాడేది.. : భర్త బోనీకపూర్

అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) మృతిపై ఆమె భర్త బోనీకపూర్(Boney Kapoor) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ది న్యూ ఇండియన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీ కపూర్ శ్రీదేవి మరణం సహజం కాదని, ప్రమాదవశాత్తు అని స్పష్టం చేశారు. భారతీయ మీడియా నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో దుబాయ్ పోలీసులు దాదాపు 48 గంటలపాటు తనను విచారించారని ఆయన చెప్పారు. కపూర్ తన భార్యను చంపిన ఆరోపణల గురించి మాట్లాడుతూ, దుబాయ్(Dubai) లో అసలు ఏం జరిగిందో తెలిపారు బోనీ కపూర్. 

శ్రీదేవిది సహజ మరణం కాదని..ఆమె ప్రమాదవశాత్తు మరణించిందని భావించి..నేను లై డిటెక్టర్ పరీక్షలతో సహా..మిగతా పరీక్షలన్నిటిలో పాల్గొనగా..శ్రీదేవి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయిందని నివేదిక స్పష్టంగా పేర్కొంది. అయితే విచారణ మొత్తం పూర్తయ్యాక..శ్రీదేవి మృతిలో ఎలాంటి కుట్రకోణం లేదని..దుబాయ్ పోలీసులు నిర్ధారించారని వెల్లడించారు.  

శ్రీదేవి సినిమాల కోసం స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యేదని బోనీ కపూర్ తెలిపారు. ఏండ్ల పాటు ఉప్పు లేకుండా తినేదని..ఎన్నిసార్లు చెప్పినా వినలేదన్నారు. ఉప్పు లేకుండా తినొద్దని డాక్టర్లు వారించినా శ్రీదేవి  పట్టించుకోలేదన్నారు. 

తెరపై నాజూగ్గా, అందంగా కనిపించేందుకు శ్రీదేవి డైట్‌ చేస్తుండేదని బోనీ కపూర్ తెలిపారు. ఆమె స్ట్రిక్ట్‌ డైట్‌ ఫాలో అవుతుందనే విషయం పెళ్లయ్యాకే తనకు తెలిసిందన్నారు. ఉప్పు లేకుండా భోజనం తీసుకునేదని..దానివల్ల నీరసించి పడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. శ్రీదేవికి లో బీపీ సమస్యలు ఉన్నాయని..జాగ్రత్తగా ఉండమని డాక్టర్లు చెప్పినా..ఆమె సీరియస్‌గా తీసుకోలేదన్నారు. 

ALSO READ : ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి: దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి

శ్రీదేవి మరణించిన తర్వాత టాలీవుడ్  నటుడు నాగార్జున తనను కలిశారని బోనీకపూర్ వివరించారు. ఆమె క్రాష్‌ డైట్‌ కారణంగా ఓసారి సెట్‌లో కూడా సృహతప్పి పడిపోయిందని చెప్పారన్నారు. ఆ సమయంలో శ్రీదేవి పన్ను కూడా విరిగిందని..నాగార్జున(Nagarjuna) చెప్పినట్లు బోనీ కపూర్ చెప్పుకొచ్చారు. 

2018లో బంధువుల వివాహం కోసం దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి ఫిబ్రవరి 24న కన్నుమూశారు. ఆమె బాత్‌టబ్‌లో జారిపడి చనిపోయిందన‍్నట్లు దుబాయ్ పోలీసులు నిర్ధారించారు. అయితే  శ్రీదేవి ప్రమాదవశాత్తూ మృతి చెందడంతో చాలామంది బోనీ కపూర్‌ని అనుమానించారు.