ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి: దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి

ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి:  దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి

ఇల్లెందు,వెలుగు:  నేరారోపణ ఎదుర్కొంటున్న  ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి సూచించారు. సోమవారం ఇల్లెందు సబ్ జైల్​లో గాంధీ జయంతి,  ఖైదీల దినోత్సవ  కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. 

 గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం ఆమె  మాట్లాడుతూ  హింస చేయకూడదనే ఉద్దేశంతోనే గాంధీ జయంతి రోజునే  ఖైదీల దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు.  జైలు నుంచి బయటకు వచ్చిన  తరువాత మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలన్నారు.  క్రీడా పోటీల్లో గెలుపొందిన  ఖైదీలకు బహుమతులు అందజేశారు.  కార్యక్రమంలో  సబ్ జైల్ సూపరింటెండెంట్​ చంద్రశేఖర్​, సీఐ కరుణాకర్, లాయర్లు కీర్తి కార్తిక్​, ఉమామహేశ్వరరావు, రవినాయక్​, జైలు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.