వాట్సాప్‌తో కరోనా వ్యాక్సిన్ స్లాట్‌ బుకింగ్: ప్రాసెస్ ఇదే

వాట్సాప్‌తో కరోనా వ్యాక్సిన్ స్లాట్‌ బుకింగ్: ప్రాసెస్ ఇదే

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆన్‌లైన్ స్లాట్‌ బుకింగ్ మరింత ఈజీగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త చర్యలు తీసుకుంది. ఫోన్‌లోనే వ్యాక్సినేషన్ స్లాట్‌ బుక్ చేసుకోవచ్చు. అది కూడా వెబ్‌సైట్ వెతుక్కునే పని లేకుండా.. వాట్సాప్‌లో లాగిన్‌ అయ్యి మెసేజ్‌ చేస్తే చాలు. ఏ ఏరియాలో, ఎప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవాలన్నది సెలక్ట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తన ట్విట్టర్‌‌ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

వాట్సాప్‌లో మైగవర్నమెంట్ హెల్ప్‌ డెస్క్‌ చాట్‌బోట్ సాయంతో కేవలం నిమిషాల్లోనే మీ ఫోన్‌ నుంచే ఈజీగా కరోనా వ్యాక్సినేషన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. ప్రజల సౌకర్యార్థం ఈ కొత్త విధానం తీసుకొచ్చామని ఆయన చెప్పారు.

ప్రాసెస్ ఇదే:

– మీ ఫోన్‌లో +91 9013151515 (MyGov‌ వాట్సాప్ నంబర్‌)‌ను సేవ్‌ చేసుకుని వాట్సాప్‌లో 'Book Slot' అని మెసేజ్ పంపాలి. లేదంటే http://wa.me/919013151515 ఈ లింక్ క్లిక్ చేసినా నేరుగా MyGov‌ వాట్సాప్ ఓపెన్‌ అవుతుంది.

– 'Book Slot' మెసేజ్‌ పంపగానే మీ ఫోన్‌ నంబర్‌‌కు ఓటీపీ వస్తుంది. 

– ఓటీపీ ఎంటర్ చేస్తే స్లాట్ బుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది.

– ఆ తర్వాత చాట్‌బోట్ అడిగే రిప్లై ఇస్తే ఏరియా పిన్‌ కోడ్ ఆధారంగా వ్యాక్సిన్ సెంటర్, డేట్ వంటివి సెలక్ట్ చేసుకోవచ్చు.