
హైదరాబాద్, వెలుగు: బీసీలకు సీఎం కేసీఆర్ వ్యతిరేకమని, అందుకే రాష్ట్రం లోని బీసీలను ఆయన అణగదొక్కు తున్నారని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. తెలంగాణలో 50 లక్షల బీసీ కుటుంబాలుంటే.. అందులో 15 లక్షల బీసీ కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నాయని తెలిపారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. లక్ష రూపాయల స్కీమ్ కోసం 5 లక్షలకు పైగా బీసీలు దరఖాస్తు చేసుకుంటే, రూ.వంద కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. బీసీలపై ప్రేమ ఉంటే చట్టబద్ధంగా బీసీ సబ్ ప్లాన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కేబినెట్లో ఉన్న ముగ్గురు బీసీ మంత్రులకు బీసీల సంక్షేమం పట్టదని ఫైరయ్యారు. బీసీలను కేసీఆర్ ఎలా మోసం చేస్తున్నారన్న విషయంపై మీడియా సమావేశంలో ఆయన ఓ పోస్టర్ ను విడుదల చేశారు.