రాష్ట్రంలో వీబీ జీ రామ్ జీ పథకాన్ని అమలు చేయాలి : మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

రాష్ట్రంలో వీబీ జీ రామ్ జీ పథకాన్ని అమలు చేయాలి :   మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్, వెలుగు: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీ జీ రామ్ జీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 60 శాతం నిధులు రూ. 3,825  కోట్లు ఇప్పటికే విడుదల చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 40 శాతం నిధులు రూ. 2,486 కోట్లు విడుదల చేస్తే, మొత్తం రూ. 6,311 కోట్ల నిధులు గ్రామాల అభివృద్ధికి అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. 

ఈ నిధులతో గ్రామీణ కూలీలకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, చెరువుల అభివృద్ధి, నీటి సంరక్షణ, మౌలిక వసతుల కల్పన వంటి అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా తన వాటా నిధులను వెంటనే విడుదల చేసి వీబీ జీ రామ్ జీ పథకాన్ని అమలు చేయాలని కోరారు.