
నాగ్పూర్ వేదికగా భారత్, ఆసీస్ జట్ల మధ్య రేపటి నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలుకానుంది. దీంతో ఇరుజట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, పాట్ కమిన్స్ ట్రోఫీని అవిష్కరించి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక మోకాలి శస్త్రచికిత్స వల్ల సుదీర్ఘ విరామం తీసుకున్న టీమిండియా స్టార్ బౌలర్ రవీంద్ర జడేజా జట్టులోకి రానున్నాడు. కొత్త టెస్ట్ జెర్సీతో ఉన్న ఫోటోను షేర్ చేసిన జడ్డూ .. 14 ఏళ్ల క్రితం ఇదేరోజున అంతర్జాతీయ జట్టులోకి అడుగుపెట్టినట్లుగా తెలిపాడు.
1996లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలైంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య మొత్తం 15 సిరీస్‌లు జరగగా భారత్ 9, ఆసీస్ 5 సిరీస్‌ల్లో గెలుపొందాయి. ఓ సిరీస్ డ్రాగా ముగిసింది. చివరిగా నిర్వహించిన మూడు ట్రోఫీల్లోనూ టీమ్‌ఇండియానే గెలుపొందింది. భారత్‌లో బోర్డర్-గావస్కర్ ట్రోఫీని 8 సార్లు నిర్వహించగా.. ఆసీస్ ఒక్కసారి మాత్రమే (2004/05) విజేతగా నిలిచింది.