
మెదక్ జిల్లాలో ఘోరం జరిగింది. రెగోడ్ మండలం మర్పల్లిలో వ్యవసాయ బోరు నీళ్లు తాగి ఐదు పశువులు మృతి చెందాయి. మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బోరు బావిలో మోటర్ ఇరకటంతో యురియా పోశారు. ఆ తర్వాత మరో మోటర్ బిగించారు. అయితే ఆ నీటిని తాగటంతో అస్వస్థతకు గురయ్యారు జనం. దీంతో వారిని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు గ్రామస్తులు.